Anchor Pradeep: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఈయన ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు కార్యక్రమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.జీ తెలుగులో ప్రసారమవుతున్న కొంచెం టచ్ లో ఉంటే చెబుతా అనే కార్యక్రమానికి ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే ప్రదీప్ సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో కూడా నటించారు. ఇదే తన మొదటి సినిమా ఈ సినిమా తర్వాత ప్రదీప్ తదుపరి సినిమాలను ఇంకా ప్రకటించలేదు కానీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా మాత్రం ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.
ఇకపోతే యాంకర్ ప్రదీప్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన బుల్లితెరపై షోలు మాత్రమే కాకుండా వెండితెరపై సినిమాలకు కూడా నిర్మాతగా మారబోతున్నారని తెలుస్తుంది.ఒక యాంకర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలి అంటే ఆయన వద్ద ఎంత డబ్బు ఉండాలో అర్థం అవుతుంది. దీంతో ఈయన ఒక్కో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని అందరికీ తెలుస్తుంది.

Anchor Pradeep: పవన్ కళ్యాణ్ తోనే మొదటి సినిమా…
ఇక ప్రదీప్ నిర్మాతగా ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని భావించారట. తాను నిర్మాతగా మారితే తన మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తోనే చేస్తానని తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పవన్ కళ్యాణ్ తో ప్రదీప్ ఏ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమా నిర్మించబోతున్నారో తెలియాల్సి ఉంది.