Anchor Rashmi: హైపర్ ఆది చేసిన పనికి వేదికపై కంటతడి పెట్టుకున్న రష్మీ.. అసలు ఏం జరిగిందంటే?

0
77

Anchor Rashmi: నటిగా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై అవకాశాలను అందుకునే పలు సినిమాలలో కూడా నటిస్తూ రష్మీ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే రష్మీ బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ ఈమెకు కమెడియన్ సుధీర్ తో ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి వార్తలు వచ్చేవి అయితే ప్రస్తుతం సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ సుదీర్ రష్మిల రిలేషన్ గురించి ప్రస్తావనకు తీసుకురావడం గమనార్హం.అయితే త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రానున్న నేపథ్యంలో మరోసారి రష్మీ సుధీర్ గురించి ఆది ప్రస్తావనకు తీసుకువచ్చారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చెప్పు బుజ్జి కన్నా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చివర్లో హైపర్ ఆది FLAMES ఆడారు.

Anchor Rashmi: సుధీర్ ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ…

ముందుగా వర్ష ఇమ్మానియేల్ ఇద్దరి పేర్లను ఫ్లేమ్స్ చేయగా మ్యారేజ్ అని వచ్చింది అనంతరం హైపర్ ఆది రష్మీ సుధీర్ పేర్లను రాస్తూ ఫ్లేమ్స్ చేయబోతూ ఉండగా వెంటనే రష్మీ తన చేతిలో ఉన్న పేపర్ లాక్కొని చింపేయడమే కాకుండా అక్కడే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ ను గుర్తు చేసుకుంటూ రష్మీ కంటతడి పెట్టుకుందని పలువురు భావిస్తున్నారు.