Anchor Suma: బుల్లితెర యాంకర్ గా సుమకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇలా ఈమెకున్న టాలెంట్ తో నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రతివారం క్యాష్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి లూసర్ టీమ్ సభ్యులు ప్రియదర్శి, కల్పిక, అన్నీ, శశాంక్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ నటుడు ప్రియదర్శిని తన బొమ్మ వేయమని చెబుతుంది. దీంతో ప్రియదర్శి తనలో ఉన్న కళాఖండాన్ని బయటపెట్టి బొమ్మ వేస్తాడు. కళ్ళు మూసుకొని వచ్చిన సుమ ఒక్కసారిగా ప్రియదర్శి వేసిన బొమ్మను చూసి షాక్ అవుతుంది.

ఆ బొమ్మని చూసిన వెంటనే ఏంటి నా బొమ్మ వేయమంటే పుష్ప సినిమాలో దాక్షాయని బొమ్మ వేశావు అంటూ సుమ నోరు జారి అనసూయ పరువు మొత్తం తీసేసింది. ఈ విధంగా సుమ అనసూయ చేసిన పాత్ర దాక్షాయణి గురించి మాట్లాడటంతో నెటిజన్లు సుమ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జబర్దస్త్ లోనూ అనసూయకు అవమానం..
ఇప్పటికే అనసూయ నటించిన దాక్షాయని పాత్ర గురించి సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ,జబర్దస్త్ కార్యక్రమంలో దాక్షాయని పాత్రలో శాంతి స్వరూప్ ని చూపిస్తూ తనని అవమాన పరిచారు. ఇప్పుడు సుమ కూడా తనలాగే మరొక తోటి యాంకర్ పట్ల ఇలా మాట్లాడటంతో నెటిజన్లు సుమ పై సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.































