Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ప్రతి ఒక్క చానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసి సుమ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించినప్పటికీ సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా ఒకవైపు సినిమా వేడుకలతో పాటు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక సుమ ఇంస్టాగ్రామ్ రీల్స్ లో తన
టీమ్ ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు.ఇప్పటికే తన టీం తో కలిసి ఎన్నో వీడియోలు చేసిన సుమ తాజాగా మరొక వీడియోని కూడా షేర్ చేశారు.
సాధారణంగా ఆదివారం వస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఎంజాయ్ చేస్తారు. తిరిగి సోమవారం లేదా విధిగా స్కూల్ కి వెళ్లాలన్న పిల్లలు లేదా పెద్దవారు ఆఫీస్ కి వెళ్ళాలన్న కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సుమ కూడా సోమవారం లేదా విధిగా షూటింగుకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్టు ఈ రీల్ చేశారు.

Anchor Suma: మా పరిస్థితి ఇదే….
చిన్నపిల్లలా దాక్కొని నేను వెళ్ళను అంటూ మారాం చేస్తోంది. ఇలా తలపై గుడ్డ వేసుకొని నేను వెళ్ళను అంటూ గొడవ చేయగా తన టీం వచ్చి తనని బలవంతంగా లాకెళ్తున్నటువంటి వీడియోని ఈమె షేర్ చేశారు. ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ మా అందరి పరిస్థితి కూడా ఇదే సుమక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.































