YS Sharmila: ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో చంద్రబాబు నాయుడు అమరావతి కోసం నిధులు తీసుకువచ్చారు అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావేశంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు బిజెపి వీరందరినీ ఒక్కొక్కరిని వెయ్యి కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారా అంటూ ఈమె విమర్శలు చేశారు. కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం కేవలం 15 వేల కోట్ల రూపాయలకు చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కేంద్రం 15000 కోట్ల రూపాయలు ముష్టి వేస్తే పండగ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఎక్కడ..
బడ్జెట్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ఈమె తెలిపారు.బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని షర్మిల ప్రశ్నించారు.కర్నూల్, కోపర్తి దగ్గర ఇండ్రస్ట్రీ హబ్‌కి ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ అంటే అంకెలకి సంబంధించిన అంశం అంటూ ఈమె బడ్జెట్ పై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.


































