మందుబాబులకు జగన్ సర్కార్ శుభవార్త.. భారీగా తగిన ధరలు..?

0
182

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మద్యం ప్రియులకు ప్రయోజనం చేకూరేలా మద్యం ధరలను భారీగా తగ్గించింది. ప్రీమియం, మీడియంలో ప్రభుత్వం ఏకంగా 25 శాతం ధరలను తగ్గించింది. గతంలో 300 రూపాయలు ఉన్న మద్యం బాటిల్ ధరను ప్రభుత్వం దాదాపు 50 రూపాయలు తగ్గించింది. జగన్ సర్కార్ లిక్కర్, విదేశీ మద్యం ధరలను కూడా తగ్గించడం గమనార్హం.


గత నెలలో మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను తగ్గించడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం జగన్ సర్కార్ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిషేధం విధించింది. అదే సమయంలో కొందరు అధికారులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటం వల్లే ధరలు పెంచి అమ్ముతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది.

రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల తరువాత మద్యం ధరలను భారీగా పెంచిన జగన్ సర్కార్ వాటిని అంచెలంచెలుగా తగ్గిస్తూ వస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో భారీగా మద్యం ధరలు పెరగడంతో కొందరు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొందరు అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం తీసుకొస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here