జగన్ మరో సంచలన నిర్ణయం… సగానికి పైగా మహిళలకే..!

0
439

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పారు. ఏపీ చరిత్రలోనే సీఎం తొలిసారి 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు కానుండగా వాటిలో సగానికి పైగా జగన్ సర్కార్ మహిళలకే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం రాష్ట్రంలో 30,000కు పైగా జనాభా ఉన్న ప్రతి కులానికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

 వెనుకబడ్డ తరగతులకు చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చటంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. రేపు రాష్ట్రంలో భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 56 కులాలలో 29 కార్పొరేషన్లను మహిళలకు కేటాయించగా 27 కార్పొరేషన్లను పురుషులకు కేటాయించారు. సగానికి పైగా సీట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కార్పొరేషన్ల విషయంలో ప్రాతినిథ్యం కలిగే విధంగా చర్యలు చేపట్టింది.
 
అనంతపురం జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో నలుగురికి పదవులు దక్కనున్నాయి.
 
అన్ని జిల్లాలకు దాదాపుగా సమ ప్రాధాన్యం ఇచ్చి సీఎం జగన్ ఏ జిల్లా ప్రజలు నష్టపోకుండా చేశారు. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.