‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన అంజలి..!!

  0
  221

  తన కెరీర్ మొదట్లో అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. ఈ మధ్య కాలంలో అవకాశాలు లేక చాలా వెనకబడిపోయింది.. మొన్నామధ్య అనుష్క నిశ్శబ్దం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన అంజలికి.. ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రల్లో నటించే అవకాశం రావడం లేదు.. ఇక తాజాగా ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించింది.. సినిమాలో అంజలితో పాటు నివేదా థామస్, అనన్య కూడా నటించారు.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..

  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అంజలి అందర్నీ ఆకట్టుకోవడానికి మునుపు ఎన్నడూ లేని విధంగా ఫుల్ గ్లామర్ డోస్ తో హల్ చల్ చేసింది. అసలు ఏ ఈవెంట్ లోనైనా గ్లామర్ ఉంటేనే ఆ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అలాగే ఈవెంట్ లో పెద్ద స్టార్ హీరో ఉంటే. ఇక కెమెరా కన్ను మొత్తం ఆ హీరోగారి చుట్టే ఉంటుంది. అందుకే ఆ హీరోని మించిన స్థాయిలో తన పై కెమెరా ఫోకస్ చేయాలని.. ప్రతి హీరోయిన్ ఈవెంట్ లో హాట్ లుక్స్ లో కనిపించి కనువిందు చేస్తోంది. అంజలి కూడా నిన్న ఈవెంట్ కి చాలా అందంగా ముస్తాబై.. మొత్తానికి తన అందచందాలతో ‘హైలైట్’ అయింది.

  నిజానికి ఈ సినిమాలో నివేత థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, శృతి హాసన్ ఇలా నలుగురు భామలు నటించినా.. ఈవెంట్ కి మాత్రం ఇద్దరే వచ్చారు. శృతి హాసన్ ముంబైలోనే ఉండిపోవడంతో, ఇక నివేధా థామస్ కి కరోనా రావడంతో వాళ్ళు ఈవెంట్ కి రాలేకపోయారు. అందుకేనేమో ఈవెంట్ లో మిస్ అయిన గ్లామర్ షోను ప్రదర్శించే బాధ్యతని అంజలి తీసుకున్నట్లు ఉంది. ఎల్లో శారీలో కెమెరామెన్ లకు కావాల్సినంత అందాలను పంచింది ఈ భామ..ఇక వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…!!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here