చైనాలో విజృంభిస్తున్న మరో వైరస్.. వేల సంఖ్యలో కేసులు నమోదు..!?

0
298

ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి పరిస్థితులు అదుపులోకి వస్తుండగా ఇలాంటి సమయంలో చైనాలో ఒక బ్యాక్టీరియా విజృంభిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6,000 మంది బ్యాక్టీరియా బారిన పడటం గమనార్హం.

ఈ బ్యాక్టీరియా బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉండటం గమనార్హం. బ్రూసెల్లోసిస్ అనే పేరుతో పిలవబడే ఈ బ్యాక్టీరియా బారిన పడి చైనాలోని లాస్ ఝౌ ప్రాంతంలో 6,000 మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండగా ఈ బ్యాక్టీరియా కూడా ల్యాబ్ నుంచే లీక్ కావడం గమనార్హం.

చైనా నుంచి కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా పేరెత్తితేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. కలుషిత జంతు ఉత్పత్తుల ద్వారా అక్కడి ప్రజలు ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాక్టీరియా బారిన పడ్డవాళ్లలో ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం. 55,000 మందికి పరీక్షలు చేయగా 6,000కు పైగా కేసులు నమోదు కావడంతో పరీక్షల సంఖ్య పెంచితే కేసులు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచ దేశాల ప్రజలను చైనా వైరస్, బ్యాక్టీరియాలతో తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మరో బ్యాక్టీరియా విజృంభణ వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.