శాస్త్రవేత్తల కీలక ప్రకటన.. వారికి కరోనా సోకదంట..? 

0
727

గత 10 నెలలుగా దేశంలోని ప్రజలు కరోనా గురించే చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు సైతం వైరస్ పేరు చెబితే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి సంబంధించి ఒక శుభవార్త చెప్పారు. కరోనా సోకకపోయినా కొందరిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.

వీరి శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించినా శరీరంలో ఉన్న యాంటీబాడీలు వైరస్ ను నిర్వీర్యం చేస్తాయని ఫలితంగా వారికి కరోనా సోకదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. పెద్దవాళ్లతో పోల్చి చూస్తే పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని అందువల్లే పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

కొన్ని కరోనా వైరస్ లు సాధారణ జలుబుకు కారణమవుతాయని వాటి వల్లే పిల్లల్లో యాంటీబాడీలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు రక్త నమూనాల ద్వారా పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా విజృంభణకు ముందు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో సైతం యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్యవాళ్లు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ప్రతి 20 మందిలో ఒకరికి కరోనా సోకకపోయినా యాంటీబాడీలు ఉన్నాయని అందువల్లే చాలా చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోయినా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రజలకు ఏ విధంగా పంపిణీ చేయాలో కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here