“ప్రేమలో విఫలమయ్యాను..” తన బ్రేకప్ గురించి బయటపెట్టిన అనుపమ..!

0
482

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అ ఆ” ద్వారా వెండి తెరకు పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్ ఆ తరువాత శతమానం భవతి, రాక్షసుడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలను దక్కించుకొని కెరియర్ లో దూసుకుపోతున్న అనుపమ క్రికెటర్ బుమ్రాతో లవ్లో పడ్డారని అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న అనుపమ తాజాగా తన అభిమానులతో ముచ్చటించారు.

సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఫాలోవర్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నటువంటి వీడియోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఒక నెటిజన్ మీరు నిజ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా అని ప్రశ్నించగా అందుకు అనుపమ సమాధానం చెబుతూ.. నిజంగానే ప్రేమించాను అదేవిధంగా బ్రేకప్ కూడా చెప్పాననే సమాధానం తెలిపారు. అదే విధంగా మరో నెటిజన్ మీరు చేయబోతున్న సినిమాలు ఏంటి అని ప్రశ్నించాగా… అందుకు అనుపమ 18 పేజీస్, రౌడీ బాయ్, కార్తికేయ 2 అని సమాధానం తెలిపారు.

ఈ క్రమంలోనే మరొక నటి నెటిజన్ హీరో రామ్ పోతినేని గురించి ఒక్క మాటలో చెప్పమనగా అందుకు అనుపమ రామ్ క్లోజ్ ఫ్రెండ్ అంటూ సమాధానం చెప్పారు.. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అయ్యో పాపం అనుపమ జీవితంలో ప్రేమ ఇలాంటి పని చేసింది ఏమిటి అంటూ కామెంట్లు చేస్తున్నారు… మరికొందరు అనుపమ బ్రేకప్ చెప్పింది క్రికెటర్ బ్రూమాకేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here