నటి అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. ఈ వీడియోను నటి షేర్ చేయడంతో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..

అనుష్క శర్మకు జంతువులు అంటే ఎంతో ఇష్టం. వాటిపై తన ప్రేమను చాటుకోవడానికి సోషల్ మీడియా ఖాతాలో ఎన్నో జంతువలుకు సంబంధించిన చిత్రాలను పంచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరభంలో విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క శర్మ ముంబై సమీపంలో రెండు జంతువుల ఆశ్రయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇక్కడ ఆమె షేర్ చేసిన వీడియో ‘టెడ్ ది స్టోనర్’ ద్వారా మొదట షేర్ చేయబడింది. అపస్మారకస్థితిలో ఉన్న ఓ కోతిని.. ప్రభు అనే వ్యక్తి సీపీఆర్ (చావు బుతుకులో ఉన్న వాళ్లకు ఊపిరి ఇచ్చి బతికించడం)ఇచ్చి బతికిచ్చిన విషయం తెలిసిందే.
కొన్ని నిమిషాల తర్వాత.. అనేక ప్రయత్నాల చేస్తే.. ఆ కోతి బతికింది. ఆ వీడియో ఫుల్ గా వైరల్ అయింది. ప్రభు చేసిన ఆ పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. అదే వీడియోను నటి అనుష్క శర్మ మళ్లీ షేర్ చేస్తూ.. ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేస్తూ.. తన స్పందనను తెలియజేసింది. ఇక నీకు దేవుని దీవెనలు ఉంటాయని.. ఒరిజినల్ వెర్షన్ వీడియోను బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రాం కామెంట్ చేశారు.































