ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో సీఎం దంపతుల పేర్లు నమోదు చేయించుకున్నారు అనంతరం వీరిద్దరూ అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత అరగంట పాటు సీఎం దంపతులిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

ఆయన స్వయంగా వైద్య సిబ్బంది తో సమావేశం అయారు. అక్కడే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో సీయం జగన్ మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన పౌరులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 4 నుంచి 6 వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం గుంటూరు నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.