AP Political: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్ గా కొనసాగుతూ ఉంటాయి. నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా కోటంరెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం రేపుతున్నాయి. అయితే కోటం రెడ్డి వ్యాఖ్యలపై బోరుగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి కొంతమంది వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బోరుగడ్డ అనిల్.. ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుటుంబాల పట్ల ఎంతో అసభ్యంగా ప్రవర్తించే ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.తాజాగా కోటంరెడ్డి వ్యవహారంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ఆడియో కాల్ లీక్ అవడంతో ఈయన పెద్ద ఎత్తున చిక్కుల్లో పడ్డారు.
నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి లాకెళ్తాను అంటూ సవాల్ చేశారు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తానని బెదిరించారు. ఇలా ఈయన
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడినంటూ చెప్పుకు తిరుగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చివరికి RPI దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు అంజయ్య ఈ విషయంపై స్పందిస్తూ బోరుగడ్డ అనిల్ కు తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు.

AP Political: బోరుగడ్డ అనిల్ రోడ్డుపై తిరిగే ఒక రౌడీ…
బోరుగడ్డ అనిల్ అసలు తమ పార్టీ సభ్యుడు కాదని.. కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, అతను రోడ్డుపై తిరిగే ఒక రౌడీ అంటూ తెలిపారు. అతను మాట్లాడే మాట, భాష ఇవన్నీ కూడా పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు నష్టం చేకూరుస్తాయి కాబట్టి ఖండిస్తామని తెలిపారు.అంబేద్కర్ పేరు చెప్పుకుని బతకాలనుకునేవారికి నిజమైన కార్యకర్తలు అడ్డుకట్ట వేస్తారని తెలిపారు. ఇలా సీఎంను ఏమైనా అంటే చంపేస్తా పొడి చేస్తా అనే వాళ్ళు ప్రస్తుతం ముఖ్యమంత్రి కి గన్ మెన్ గా ఉండాలి కానీ ఇలా అడుక్కుతినే పరిస్థితిలలో ఉండరు అంటూ అంజయ్య బోరుగడ్డ అనిల్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































