ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 18 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈమెయిల్/రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 22. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారక https://apmdc.ap.gov.in/వెబ్ సైట్ చూడవచ్చు.

ఏపీఎండీసీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు సంబంధించిన ఖాళీలను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి విభాగాలలో రెండు జనరల్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంబీఏ,సీఏ ఉత్తీర్ణతతో పాటు ఐసీఎస్ఐ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 30 నాటికి 54 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
ఎన్విరాన్‌మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ఎఫ్&ఏజ/ట్యాక్సేషన్, సీఎస్ఆర్, సివిల్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 5 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.డిగ్రీతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్), సీఏ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏప్రిల్ 30 నాటికి 45 సంవత్సరాలు మించి ఉండకూడదు.
సర్వే/జీఐఎస్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ అడ్మిన్, ఐటీ, మైనింగ్, కంపెనీ సెక్రటరీ ఈ విభాగంలో కాళీగా ఉన్న 11 మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు /డిప్లొమా, ఇంజనీరింగ్, ఐసీఎస్‌ఐ సర్టిఫికెట్, బీకాంతోపాటు సీఏ/ఐసీడబ్య్లూఏ, ఎంజీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏప్రిల్ 30 నాటికి 40 సంవత్సరాల వయసు మించకూడదు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి మే 22 చివరి తేదీ































