ఆంధ్రప్రదేశ్ విజయవాడ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఏపీఎండీసీ ఒప్పంద ప్రాతిపదికన 18 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఖాళీగా ఉన్న 18 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://apmdc.ap.gov.in/ lo చూడవచ్చు.

మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగంలో జనరల్ మేనేజర్ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్), సీఏ ఉత్తీర్ణతతో పాటు ఐసీఎస్ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వీరి వయసు54 సంవత్సరాలకు మించి ఉండకూడదు .
ఎన్విరాన్‌మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ఎఫ్&ఏజ/ట్యాక్సేషన్, సీఎస్ఆర్, సివిల్. ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ 5 పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీతో పాటు ఎంబీఏ(మార్కెటింగ్), సీఏ, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత తోపాటు అనుభవం కలిగి ఉండాలి. 45 సంవత్సరాలు మించి వయసు ఉండకూడదు.
సర్వే/జీఐఎస్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ అడ్మిన్, ఐటీ, మైనింగ్, కంపెనీ సెక్రటరీ విభాగంలో ఖాళీగా ఉన్న 11 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ/డిప్లొమా, ఇంజనీరింగ్, ఐసీఎస్‌ఐ సర్టిఫికెట్, బీకాంతోపాటు సీఏ/ఐసీడబ్య్లూఏ, ఎంజీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఖాళీగా ఉన్న 18 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు -మెయిల్/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.apmdchrdrecruitments@gmail.com దరఖాస్తు స్వీకరణకు మే 22 చివరితేది.






























