ఆల్కహాల్ గురించి వినని వారు ఎవరూ ఉండరు. కొన్ని దశాబ్దాలుగా ఆల్కహాల్ ను బీర్, వైన్, వంటి మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ ఆల్కహాల్ ను శానిటైజర్ లలో కూడా ఉపయోగిస్తున్నారని మనకు తెలుసు. కేవలం ఈ విధమైనటువంటి ఉత్పత్తులలో మాత్రమే కాకుండా, ప్రతిరోజు మనం ముఖానికి రాసుకునే వివిధ రకాల కాస్మటిక్ ఉత్పత్తులలోనూ ఆల్కహాల్ ఉపయోగిస్తారు.

ఆల్కహాల్ లో హైడ్రాక్సిల్ అణువులు ఎక్కువగా ఉంటాయి. మనం తరచూ ఉపయోగించే లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్ వంటి వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల లో ఈ ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు. ఈ విధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే ఆల్కహాల్ ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఆల్కహాల్ ను వివిధ రకాల పండ్లు కూరగాయలను ఉపయోగించి ఫెర్మంటేషన్  పద్ధతి ద్వారా తయారు చేస్తారు.

నిపుణుల ప్రకారం ఫ్యాటీ ఆల్కహాల్ ఉపయోగించి తయారుచేసే బ్యూటీ ప్రొడక్ట్స్ మంచివని వీటివల్ల మన శరీరానికి ఎటువంటి సమస్యలు ఎదురవని భావిస్తున్నారు. ఈ ఉత్పత్తులను ఉపయోగించటం వల్ల కాలుష్యం నుంచి మన చర్మం దెబ్బతినకుండా, పైన ఒక లేయర్ మాదిరి ఏర్పడి చర్మాన్ని రక్షిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

సింపుల్ ఆల్కహాల్ ఎక్కువగా ఇథనాల్, బెన్జైల్, ఇసోప్రొపైల్, మిథైల్ వంటి ఆల్కహాల్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చర్మం దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖం పై మొటిమలు మచ్చలు ఏర్పడి చర్మం ముడతలు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.దీర్ఘకాలం పాటు ఇటువంటి ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here