అతిగా ఆకలి వేస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..?

0
212

మనలో కొంతమంది ఎంత తిన్నా కొంత సమయానికే మళ్లీ ఆకలి వేస్తోందని చెబుతూ ఉంటారు. రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడంతో పాటు చిరుతిళ్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఈ విధంగా తినేవాళ్లు తక్కువ సమయంలో బరువు పెరుగుతారని వెల్లడిస్తూ ఉంటారు. అయితే అతి ఆకలితో బాధ పడే వాళ్లకు ఆ సమస్య అధిగమించడానికి సులువైన పరిష్కార మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ జార్జియా ఒక అధ్యయనం నిర్వహించి ఆహార సమస్యను ఆహారంతోనే పరిష్కరించవచ్చని చెబుతోంది. ఈ అధ్యయనం ద్వారా కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల అతి ఆకలి సమస్యను సులభంగా అధిగమించవచ్చని తేలింది. కనోలా ఆయిల్‌, సాల్మన్, వాల్ నట్స్ ద్వారా అతి ఆకలి సమస్యను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 – 35 మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు.

వారం రోజుల పాటు వాల్‌నట్స్, సాల్మన్, కనోలా ఆయిల్‌ తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో తినాలనిపించే కోరిక తగ్గుతుందని.. తమ పరిశోధనల్లో ఎవరైతే ఈ ఆహారం తీసుకున్నారో వారిలో సరైన సమయానికే ఆహారం తీసుకోవడం, ఆకలి వేయడం తగ్గడం తగ్గినట్టు గుర్తించామని.. అయితే ఈ ఆహారాన్ని వైద్యులు, నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఎవరైతే బరువు పెరుగుతారో వాళ్లలో తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. బరువు పెరిగితే తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు నుంచి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here