Arha: నిమిషానికి రెండు లక్షల రెమ్యూనరేషన్… అర్హ క్రేజ్ మామూలుగా లేదుగా?

0
59

Arha: ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.అల్లు అర్జున్ ఇప్పటికే తన కుమార్తె అల్లు అర్హను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈమె ఇండస్ట్రీలోకి బాలానటిగా అడుగు పెట్టారు.సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో ఈమె భరతుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో అర్హ నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలనటిగా మెప్పించినటువంటి ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమాలో కూడా అవకాశం అందుకున్నారని తెలుస్తుంది.

ఈ విధంగా అల్లు అర్హకు ఇది రెండవ సినిమా.ఇలా రెండవ సినిమాకే ఈమె క్రేజ్ మామూలుగా లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్హ సుమారు 10 నిమిషాల పాటు కనిపించబోతుందని సమాచారం. అయితే ఈ పది నిమిషాల పాత్ర కోసం అర్హ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారట.

Arha: 20 లక్షల రెమ్యూనరేషన్…


నిమిషానికి రెండు లక్షలు చొప్పున 10 నిమిషాలకు గాను 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.ఇలా ఇంత చిన్న వయసులోనే అది రెండవ సినిమాకే ఈ స్థాయిలో ఈమె రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.