తెలుగు దర్శకులలో కాంట్రవర్సి డైరెక్టర్ కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే వెంటనే అందరూ రాంగోపాల్ వర్మ పేరు చెబుతారు. ఈయన మాట తీరు ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి ఏవిధంగా స్పందిస్తారో ఆయనకే తెలియదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు వివాదాలకు కారణమవుతుంటారు.

రామ్ గోపాల్ వర్మ వ్యవహారశైలి తెలిసినప్పటికీ కొందరు యూట్యూబ్ యాంకర్లు అతనితో ఇంటర్వ్యూ తీసుకుంటే బాగా పాపులారిటీ వస్తుందన్న క్రమంలో ఆర్జివిని ఇంటర్వ్యూ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అరీయానా రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా ఈ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాట తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆరియనా ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా కొట్టేసింది.
రాంగోపాల్ వర్మ ద్వారా తనకు ఈ స్థాయిలో ఆదరణ దక్కిందని ఈ బిగ్ బాస్ బ్యూటీ గురుదక్షిణగా మరోసారి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ ఇంటర్వ్యూ, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో వీరిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు.ఇదిలా ఉండగా అరియాన బాటలోనే మరో బ్యూటీ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమైంది.
ప్రస్తుతం బుల్లితెరపై, వెబ్ సిరీస్ లతో పాటు పలు కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న అషు రెడ్డి కూడా రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అషు రెడ్డి కుర్చీలో కూర్చుని ఉండగా రాంగోపాల్ వర్మ కింద కూర్చొని ఆమె తొడలు ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫోటోలు తీశాడు.
ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డికి ఫోటోలు తీస్తున్నటువంటి వీడియోను ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే మరికొందరు స్పందిస్తూ ఆర్జీవి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లేవారు కావలసిగానే ఈ విధమైనటువంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తారా అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































