వర్మ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది సంచలనం.. తర్వాత కాంట్రవర్సి. అయితే ఇటీవల అమ్మాయిలతో ఫుల్ గా తాగి చిందులేసిన వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డిని వీడియో తీస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కూడా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు వర్మపై వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.

అయితే తాజాగా వర్మ ప్రవర్తనపై అషురెడ్డి చెంప చెల్లుమనిపించింది. దానికి ప్రతీకారంగానే ఇలా చేసింది అని అనుకుంటున్నారా.. కాదు.. పూర్తి వివరాల్లోకి వెళ్లి ఎందుకు ఇలా చేసిందో తెలుసుకుందాం.. ఇటీవల వర్మ అందమైన అమ్మాయిలతో బోల్డ్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నాడు. ఆ మధ్య అరియానాతో వర్మ చేసిన చిట్ చాట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అషూ రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వెళ్లిన వర్మ స్వయంగా తనకు తానే పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు ఆ యాక్టింగ్ లో మునిగి తేలారు. మీరేవరో తెలియదు అన్నట్లు అషురెడ్డి యాక్టింగ్ చేసింది. వర్మ ఆమెను కింది నుంచి పైదాకా చూస్తూ.. నీ థైస్ బాగున్నాయ్ అని వర్మ ఏ మాత్రం భయం లేకుండా చెప్పేశాడు.
దీంతో అషు రెడ్డి.. వాట్ అంటూ అతడి చెంప చెల్లుమనిపించింది. ఇక్కడి వరకు ప్రోమో చూపించారు. తర్వాత ఏమైందనే దానిని తెలుసుకోవాలంటే.. సెప్టెంబరు 7వ తేదీ వరకు ఆగాల్సిందే.. ఎందుకంటే ఆ రోజు ఈ వీడియో విడుదల అవుతుంది.































