Avula Giri : నితిన్ తో సై సినిమా చేసి మానసికంగా దెబ్బ తిన్నాను..: ప్రొడ్యూసర్ ఆవుల గిరి

0
303

Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి ‘సై ‘ సినిమా వల్ల తను ఎంతో ఇబ్బంది పడ్డాను అంటూ రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ సినిమా మానసికంగా ఇబ్బంది పెట్టింది…

సై సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆవుల గిరి ఆ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా నష్టాలను ఇవ్వలేదని అలాగని మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టాలేదంటూ తెలిపారు. రాజమౌళి మొదట తనకు నార్మల్ కమర్షియల్ సినిమా కావాలా లేక స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సినిమా అనుకుంటున్నా అలాంటిది చేద్దామా అని అడిగితే నేను రొటీన్ బోర్ కొట్టి స్పోర్ట్స్ సినిమాకు ఓకే చెప్పాను. అయితే కొంత మంది హీరోలు నన్ను కలిసి సినిమా అవకాశం అడిగినా సుధాకర్ రెడ్డి గారికి మాటిచ్చానని నితిన్ ను హీరోగా పెట్టుకుందామనుకున్నా రాజమౌళి ఓకే చేసాడు.

అయితే ఆ మధ్యలో చాలా మంది హీరోలు నన్ను కలిసి మాట్లాడేసరికి సుధాకర్ రెడ్డి గారు నితిన్ తన కుటుంబంతో ఇంటికి వచ్చి మీరు డెసిషన్ మార్చుకోకండి సినిమాలో నేను చేస్తాను అని అడిగారు. సినిమా పూర్తయింది. సినిమా ఫలితం బాగుంది కానీ లాభాలు ఎక్కువ రాకపోయినా నాకు బాధగా అనిపించలేదు కానీ నితిన్ ని హీరోగా పెట్టుకోవడం వల్ల జరిగిన పరిణామాలకు మానసికంగా చాలా బాధపడ్డాను సై సినిమా విషయంలో అంటూ తెలిపారు. ఆ సినిమా తరువాత విజయేంద్ర ప్రసాద్ అలాగే రాజమౌళి మరో సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు కానీ నేనే వినియోగించుకోలేదు అంటూ చెప్పారు.