Babu Mohan: నాటకాల ద్వారా మొదలై ఆహుతి, అంకుశం, అమ్మోరు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్ ఆ తరువాత వచ్చిన మామగారు సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా రాణించి, టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసిన బాబు మోహన్ ఆ తరువాత అన్న గారి ప్రొధ్భలంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ లో ఉన్న బాబు మోహన్ గారు ఆయన సినిమా ప్రస్థానంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు.

కోటా – బ్రహ్మానందం నాతో నటించనన్నారు…
చినుకు చినుకు పాటలో సౌందర్య గారితో చేసినపుడు చాలా మంది సౌందర్య కెరీర్ పోతుంది అంటూ చెప్పినా బాబు మోహన్ గారితో పాటలో చేయడం నా అదృష్టం అంటూ చెప్పిందట సౌందర్య. ఆ పాట తరువాత చాలా సినిమాల్లో బాబు మోహన్ గారికి పాట పెట్టడం ట్రెండ్ అయింది. అలా సుమారు రెండోదల పాటలు చేసానని ఆ సమయంలో కోటా బ్రహ్మానందం గారు బాబు మోహన్ ఉంటే మేము నటించం అని చెప్పడంతో చాలా మంది డైరెక్టర్లు పాత్రలు చేంజ్ చేసి నాకు ఎవరో ఒక హీరోయిన్ లేదా ఆర్టిస్ట్ తో సాంగ్ పెట్టడం చేసారు.

మళ్ళీ దాసరి నారాయణ రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కల్పించుకుని ముగ్గురు కలిసి నటించండి అని చెప్పడం వల్ల మళ్ళీ మా కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. అయితే అప్పుడు కూడా నాకు ఎవరితో నటించడానికైనా ఏం అభ్యంతరం లేదు అని మొదటి చెప్పేసాను అంటూ ఆసక్తికర వాఖ్యలు చేసారు బాబు మోహన్.



































