శరీర ఆరో్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లతో పాటు ఖనిజలవణాల పాత్ర కూడా ఎంతో కీలకం. వాటిలో జింక్ అనే పోషకం శరీరానికి అత్యంత అవసరమైన మినరల్స్‌లో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మం, జుట్టు ఆరో్యాన్ని మెరుగుపరచడం వరకు జింక్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు, పోషకాహార లోపం కారణంగా చాలా మందిలో జింక్ కొరత కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జింక్ శరీరంలో కణాల పెరుగుదల, గాయాల మాన్పు ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు అవి తిరిగి త్వరగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా జింక్ అవసరం. చిన్నపిల్లల ఎదుగుదలలో, మెదడు అభివృద్ధిలో కూడా ఈ పోషకం కీలకంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో జింక్ స్థాయులు తగ్గిపోతే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా జుట్టు అధికంగా రాలిపోవడం, గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ జలుబు లేదా ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమందిలో ఆకలి తగ్గడం, నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జింక్ లోపం రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరం చిన్న ఇన్ఫెక్షన్లకే బలహీనపడే ప్రమాదం ఉంటుంది. చర్మం పొడిబారడం, ఎర్రబడటం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వల్ల విరేచనాలు, కడుపు అసౌకర్యం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ పోషక లోపాన్ని నివారించాలంటే రోజువారీ ఆహారంలో జింక్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, రాగులు వంటి ధాన్యాల్లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే గుమ్మడికాయ, పుట్టగొడుగులు, ఆకుకూరలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
మాంసాహార పదార్థాల్లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పప్పుధాన్యాలు, వేరుశెనగలు వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల జింక్ లోపాన్ని కొంతవరకు నివారించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యంపై చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా జుట్టు రాలడం, గాయాలు ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకుని అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



























