Balagam fame mime Madhusudhan : మైమ్ ట్రైనర్ గా మంచి గుర్తింపు ఉన్న నటుడు మైమ్ మధు ‘బలగం’ సినిమాతో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైమ్ ఆర్టిస్ట్ గానే కాకుండా మైమ్ ట్రైనర్ గా కూడా ఉన్న అరుసం మధుసూధన్ గారు ఆయన ప్రతిభకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకెడమీ అవార్డు, ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఇక ఆయన సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఇక బుల్లితెర మీద కూడా చక్రవాకం, శ్రావణ సమీరాలు సీరియల్స్ లో నటించారు. ఇక వెండితెర మీద ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్, తాజాగా బలగం సినిమాలో నటించారు. బలగంలో హీరో బాబాయ్ గా తాగుబోతుగా నటించిన ఆయన ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు.

వేణు మీద నమ్మకం కుదర్లేదు…
సినిమాలో నటించే అవకాశం ఆకాశవాణి సినిమా చూసి సెలెక్ట్ చేసారంటూ చెప్పారు మధు. ఇక సినిమా కథ విని కొంతమంది సినిమా చేయాలని అనుకుంటే మరికొంతమంది వేణు మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే వీటన్నిటి వెనుక నిజానికి దిల్ రాజు బ్యానర్ బాగా ప్రభావం చూపింది.

అంత పెద్ధ బ్యానర్ లో సినిమా అనగానే అందరికీ ఒక భరోసా వచ్చింది. ఇక్కడ మెయిన్ హీరో దిల్ రాజుగారే. ఆయన కథ నచ్చి వేణు కి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. వేణు కి డైరెక్షన్ లో అనుభవం లేకపోయినా ఆయన కథను, వేణుని నమ్మాడు అంటూ చెప్పారు మధు. చాలా మంది వేణు వెనుక ఉన్న దిల్ రాజు గారి వల్లే సినిమా చేసారు అంటూ తెలిపారు.






























