Balakrishna:నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా కాచిగూడలో ఉన్నటువంటి తారకరామా థియేటర్ ను పున ప్రారంభించారు.తారక రామారావు పేరుతో ఉన్నటువంటి ఈ థియేటర్ కొన్ని అనివార్య కారణాలవల్ల మూతపడింది. దీంతో ఏషియన్ వారితో కలిసి టై అప్ అయ్యి ఏషియన్ తారక రామ థియేటర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త హంగులతో ఈ థియేటర్ అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ థియేటర్ ను బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ థియేటర్లో అవతార్ 2 సినిమా ప్రసారం కానుంది. ఈ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ థియేటర్ తో వారికున్నటువంటి అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… తారక రామారామ థియేటర్ కు ఓ చరిత్ర ఉందని తెలిపారు.ఈ థియేటర్ ను తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా పెట్టమని బాలకృష్ణ తెలియజేశారు.
ఈ థియేటర్లో డాన్ సినిమా 525 రోజులు ఆడిందని అలాగే తన సినిమాలు కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయని బాలకృష్ణ తెలిపారు. ఇక ఈ థియేటర్ కొన్ని కారణాలవల్ల మూతపడినప్పటికీ ఏషియన్స్ వారితో కలిసి తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Balakrishna తారకరామ థియేటర్లో మోక్షజ్ఞ నామకరణం…
ఇకపోతే మోక్షజ్ఞకు ఈ థియేటర్ కి విడదీయరానీ అనుబంధం ఉందని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు.మోక్షజ్ఞ పుట్టిన తర్వాత తన తండ్రి తారక రామారావు గారు ఈ థియేటర్లోనే తనకు నామకరణం చేశారని బాలకృష్ణ ఈ సందర్భంగా మోక్షజ్ఞకు తారక రామారామ థియేటర్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ప్రస్తుతం బాలయ్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































