Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

తాజాగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వచ్చేయడాది ఉండబోతుంది అంటూ బాలయ్య అమెరికాలోని తానా సభలలో ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయాన్ని కూడా తెలిపారు.
మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని బాలకృష్ణ తెలిపారు. కానీ దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రం తెలియ చేయలేదు. బహుశా ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి బాలయ్య అంతా దైవేచ్ఛ అంటూ సమాధానం చెప్పారు.

Balakrishna: వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ..
ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రారంభమవుతాయని బాలయ్య తెలిపారు. అంటే ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులు ప్రారంభించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.దీంతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కూడా వచ్చే యేడాదే ఉండబోతుందని అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.