Balakrishna: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇలా భారీ బడ్జెట్ చిత్రాలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పాలి.ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ విక్రమ సింహభూపతి అనే భారీ బడ్జెట్ స్థాయిని తెరకెక్కించాలని భావించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాహుబలి సినిమాను మించి ఉంటుందని. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తారు. ఇలా బాలకృష్ణ తన నాన్నమ్మతో కలిసి బాలకృష్ణ ప్రతాప్ వర్మ అనే పాత్రలో నటిస్తూ అడవిలో ఉంటారు. కొందరు బందిపోటులు అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చి బాలకృష్ణను చూసి అందరూ తనకు నమస్కారం పెడతారు.
అదే సమయంలో సినిమా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి ప్రతాప్ వర్మ ఎవరు తన తండ్రి ఎవరు తన తండ్రిని ఎవరు చంపారనే విషయం గురించి సినిమా కథ నడుస్తుంది. ఇలా ఎన్నో ట్విస్ట్ లతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక 2001వ సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద ఎత్తున సెట్ వేసి ఈ సినిమా రెండు పాటలను చిత్రీకరించడమే కాకుండా 50% షూటింగ్ కూడా పూర్తి చేశారు.

Balakrishna: సిద్ధాంతి జోస్యం చెప్పడమే కారణమా
ఒక సిద్ధాంతి నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డితో ఈ సినిమా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావని చెప్పారట. అనుకున్నట్టుగానే ఆయన చెప్పిన విధంగానే బాలకృష్ణ సీమ సింహం సినిమా కోసం కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవడం అలాగే బాలకృష్ణ నానమ్మ పాత్రలో నటించినటువంటి భానుమతి తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇక నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అయితే ఈ సినిమా కనుక ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే అప్పట్లోనే ఈ సినిమా బాహుబలి స్థాయిలో హిట్ అయి ఉండేదని భావిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమాని తిరిగి చేయాలన్న దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత బి గోపాల్ రెడ్డి కూడా లేరు కనుక ఈ సినిమా ఆసాధ్యం అనే చెప్పాలి.































