అక్టోబర్ 10 న జరిగే మా అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోటీ పడుతున్నారని.. అలాంటి వారితో తాను పోటీ పడి గెలిచి.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తప్పు చేసిన వాడిని అవుతానని.. అందుకే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్.

ప్రస్తుతం మా అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఎవరు గెలిచిన నా సహకారం ఉంటుందని.. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడాని తన వంతు ప్రయత్నం కూడా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా అతడు ట్విట్టర్ పోస్టు చేశాడు.. ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను..’ అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
ఇలా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడానికి గల కారణం మరేదైనా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాన్ ను బండ్ల గణేష్ నా దేవుడు అంటూ సంబోధిస్తుంటాడు.. ఈ విషయం అందిరికీ తెలిసిందే. ఈ మధ్య పవన్ పై పోసాని వ్యక్తిగతంగా మాట్లాడుతూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానిపై బండ్ల గణేష్ స్పందించాడు.
పోసాని ఒక ఎక్స్ఫైర్ అయిన ట్యబ్లెట్ అని.. ఫ్యామిలీ లో ఉన్న వ్యక్తులను ఈ గొడవలోకి లాగడం అనేది మంచిది కాదని అన్నారు. దేవుడు అనే వాడు ఉంటే.. పోసానికి భయంకరమైన చావు వస్తుందని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టి.. చాలా పెద్ద తప్పు చేశావని కూడా హెచ్చరించారు. అతడి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.































