Bandla Ganesh -Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్లగణేష్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే బండ్ల గణేష్ మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఒక చిన్నమాట అన్న ఏ మాత్రం సహించడు.తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అంటూ పవన్ కళ్యాణ్ పై ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు.

ఇక ఈయన మైకుపట్టి ఏ వేదిక పైకి వెళ్లిన పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తాడు. పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ పెద్ద ఎత్తున పవన్ నామస్మరణ చేస్తూ ఆయన భక్తుడిగా ఉంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చూస్తే పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన షేర్ చేసిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్విట్టర్ వేదికగా బండ్లగణేష్ ఆడియో విడుదల చేస్తూ..జీవితంలో ఎవరిని నమ్మకూడదు కేవలం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని నమ్ముకుని వచ్చిన భార్య మన పిల్లలను మాత్రమే నమ్మాలని వారి కోసమే బ్రతకాలని సూచించారు. మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ల కోసం మనం బ్రతుకుదాం.. వాళ్లు మన పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలి. మనం జన్మనిచ్చిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం.
బండ్ల గణేష్ ని దూరం పెట్టిన పవన్…
మనం ఇష్ట పడిన వారి కోసం మనల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకూడదు అంటూ బండ్ల గణేష్ ఆడియో విడుదల చేశారు.అయితే ఈ వీడియోలో ఎక్కడ ఎవరి పేరు ప్రస్తావించక పోయినప్పటికీ బండ్ల గణేష్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ దేవుడు పూజారి వరం ఇవ్వలేదేమో అంటూ కామెంట్లు చేయగా… మరి కొందరు పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను మోసం చేశాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ఈ ఆడియో వైరల్ అయింది.
— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2022

































