కొండ నాలుక కు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిందంట.. ప్రస్తుతం బట్టతల కోసం మందులు వేసుకుంటే బట్టతల సంగతి దేవుడెరుగు మరో అనుకోని సమస్య ఎదురవుతుందట. ఈరోజుల్లో బట్టతల అనేది సర్వసాధారణ విషయం. అయితే ఈ బట్టతల ఆడవారికంటే మగవారినే ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అసలు జుట్టే మనిషికి అందం.

అయితే తాజాగా ఒక ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. బట్ట తలకోసం వాడే మందుల వాళ్ళ మగవారి లైంగిక సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందట. ఈ విషయం తమ వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషేంట్లను హెచ్చరిస్తున్నా వారు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదని, ట్రీట్మెంట్ చేయమని అంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మందులలో వాడే ఫినాస్టెరాయిడ్ మరియు డూటా స్టెరాయిడ్‌లు లు వాడతారని, వీటి వల్ల పురుషుల్లో లైంగిక సామర్ధ్యము తగ్గిపోతుందని, ఇది కొందరిలో తాత్కాలికంగాను, మరికొందరిలో దీర్గాకాలికంగా ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.































