రైతుల అకౌంట్లలో రూ.2,000 జమ.. ఎలా చెక్ చేయాలంటే..?

0
279

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏడో విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని వార్తలు వస్తున్నా కేంద్రం నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమైంది. కేంద్రం అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసి రైతులకు మరోసారి తీపికబురు అందించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6వ విడత పీఎం కిసాన్ నిధులు జమ కాగా నేడు మలి విడత నిధులు జమయ్యాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతిసారి వివరాలను వెరిఫై చేసి కొత్తగా దరఖాస్తు చేసిన రైతుల దరఖాస్తులను పరిశీలించి రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో కేంద్రం నగదును జమ చేస్తోంది. దేశంలో దాదాపు పది కోట్ల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

ఎవరైన అర్హులై పీఎం కిసాన్ నగదు పొందలేదంటే ఆధార్ కార్డు అందజేయకపోవడం, ల్యాండ్ వివరాలు సరిగ్గా లేకపోవడం జరిగి ఉంటుంది. పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హులైన వాళ్లు తమ ఖాతాల్లో నగదు జమ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి beneficiary status అనే ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

అర్హులై ఏ కారణం చేతనైనా ఖాతాలో నగదు జమ కాకపోతే 155261 లేదా 18001155266 నంబర్లకు ఫోన్ చేసి నగదు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here