బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ గెలవడానికి శ్రీరామ చంద్ర , షణ్ముఖ్ జస్వంత్ తమ సొంత గేమ్ స్ట్రాటజీని కలిగి ఉన్నారు. వాళ్లిద్దరికి బయట కూడా అలానే అభిమానులు కలిగి ఉన్నారు. కానీ బిగ్ బాస్ షోలో వారి ప్రదర్శన విషయానికి వస్తే.. శ్రీరామ్.. షన్ను ఒక్కసారి మాత్రమే గొడవపడ్డారు.

తరువాత వారు ఎటువంటి వాగ్వాదాలకు దిగలేదు. ఇలా వాళ్లిద్దరు హౌస్ లో మంచి స్నేహితులుగా సాగారు. సిరితో షణ్ముఖ్ టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్న సమయంలో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్ తో కనెక్ట్ కాలేకపోయారు. ఇక వీరిద్దరు కలిసి స్నేహితులుగా ముందుకు సాగితే బిగ్ బాస్ టైటిల్ ఫలితం వేరే విధంగా ఉండేదని ఒక వర్గం ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.
ఇక శ్రీరామచంద్ర సెకండ్ రన్నరప్ కు హౌస్ నుంచి వెనుదిరిగాడు. ఇండియన్ ఐడల్ 5 గెలుచుకున్న శ్రీరామచంద్ర .. బిగ్ బాస్ 5 కూడా గెలుచుకుంటానని.. 5 అనే అంకె సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నానని.. కానీ అది జరగలేదని చెప్పుకొచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు వివిధ ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఇక ఓ ఇంటర్వ్యూలో ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు.. తను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో మొత్తం బాధ్యత తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. గత మూడు సంవత్సరాల నుంచి తన పెళ్లి గురించి ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని చెప్పాడు.
అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇంట్లో వాళ్తతో ఎక్కువగా కలిసి పోయే గుణం ఉండాలి.. అంతకంటే ముఖ్యంగా తన ఆలోచనలకు తగ్గట్టూ ఉండాలని అతడు.. తన కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్నాడు.































