Bigg Boss Telugu OTT:బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే ముందుగా ఈ కార్యక్రమం తెలుగులో కన్నా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. స్టార్ మాలో ప్రసారమైన ఐదవ సీజన్ పూర్తికాగానే నిర్వాహకులు ఓటీటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని వేగంగా పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మనం చూడవచ్చు. ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి నెలలో ప్రసారం కానుందని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం ఫిబ్రవరి మూడవ వారం అంటే 20వ తేదీ ప్రసారం అవ్వచ్చు అనే వార్తలు బలంగా వినబడుతున్నప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేదు.
ఆ కంటెస్టెంట్ లు వీళ్లే..
బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తి అయిందని త్వరలోనే వారందరిని క్వారంటైన్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి హీరో నవదీప్, యూట్యూబర్స్, వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, యాంకర్ వర్ష్, దిల్‌సే మహబూబ్, సిరి హన్మంతు బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, మౌనికారెడ్డి, శ్రీ విద్య, శ్వేతా నాయుడు తదితరులు పాల్గొంటున్నట్లు సమాచారం. ఒక ఈ కార్యక్రమాన్ని గంటసేపు కాకుండా 24 గంటలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.


































