Bigg Boss Sarayu: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బిగ్ బాస్ సరయు ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కేవలం ఒకే ఒక వారం రోజుల పాటు కొనసాగిన పెద్ద ఎత్తున సంచలనంగా మారారు. అయితే అప్పటికే ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బూతు పదాలతో పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో అని ఎవరు కూడా దీనిని చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ అందరికీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చెబుతూ వార్తలలో నిలిచారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సరయు పెళ్లి గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పెళ్లిపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని అందుకే తాను జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఇలా బ్యాచిలర్ గానే ఉండిపోతానని తెలిపారు. పెళ్లి చేసుకొని జీవితాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంటూ ఈమె మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss Sarayu: రామ్ చరణ్ కు పెళ్లయితే బాగా ఏడ్చాను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని సరయు తెలియజేశారు. ఒకవేళ తనకు రామ్ చరణ్ తో కలిసి డేటింగ్ చేసే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని ఈ సందర్భంగా ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఈమె చేసినటువంటి ఈ రొమాంటిక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగినప్పుడు తాను బాగా ఏడ్చానని ఈ సందర్భంగా ఈమె తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వరాలు అవుతున్నాయి.