Ramgopal Varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా, రాజకీయాలు అనే తేడా లేకుండా అన్ని విషయాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా వర్మ చేసిన ఈ ట్వీట్ పై బీజేపీ నేత రాజా సింగ్ వర్మ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ స్పందిస్తూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపతి ముర్మును ఈ విధంగా వర్మ కించపరుస్తూ ట్వీట్ చేశారని ఆయన పై మండిపడటమే కాకుండా వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ ఆదివాసీ రాష్ట్రపతి మహిళ అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడం బాధాకరమన్నారు.
వర్మ మత్తులో ఇలాంటి పోస్ట్ లు చేస్తుంటారు…
వర్మ తాగిన మత్తులో ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారని రాజ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అంటూ వర్మ పై ఫైర్ అయ్యారు. ఈయన కేవలం రాంగోపాల్ వర్మపై మాత్రమే కాకుండా,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పై రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022
































