తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ బామలు ఎంత డిమాండ్ చేస్తున్నారు !

0
73

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు భారీగా క్రేజ్ ఉంటుంది వాళ్ళని చూసే జనాలు సినిమా థియేటర్ కి వస్తారు అలాగే సినిమా కొన్ని సినిమాలు సైతం బాగా లేకపోయినా వాళ్ల క్రేజ్ తో ఆడిన సినిమాలు సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉంటాయి అయితే సినిమాలో దర్శకుడు ఎవరు అనేది దానికంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అనే దాని పైనే సినిమా సక్సెస్ అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సినిమా స్క్రీన్ పై ఆడియన్స్ కి కనబడేది హీరో హీరోయిన్ మాత్రమే కాబట్టి వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది.

తెలుగులో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరోలు వాళ్ల రేంజ్ లో సక్సెస్ ఫుల్ హీరోలుగా దూసుకుపోయారు అలాగే హీరోయిన్లుగా ఉన్న సావిత్రి, వాణిశ్రీ, జమున, జయప్రద లాంటివారు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో రాణించారు అయితే అందరిలో ఒక డౌట్ మాత్రం అలాగే ఉండిపోతుంది ఏంటంటే హీరో హీరోయిన్లు సినిమాల్లో ఎంత తీసుకుంటారు అని దానిపైన తెలుగులో మార్కెట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకి ఇచ్చే రెమ్యూనరేషన్లు కూడా తక్కువగా ఉండేవి కాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలు వాళ్ళ క్రేజ్ ని ఇండియా మొత్తం విస్తరింపజేశారు.

అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలియా భట్, దీపికా పదుకొనే లాంటి వారికి మాత్రం సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది అలాంటి హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ని తీసుకున్నారు. అయితే సౌత్ లో దర్శకులను నమ్మకపోయినా అలియాభట్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆమెకి రోజుకి 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే తన స్టాఫ్ కి రోజుకు లక్ష రూపాయలు ఇస్తూ ఆవిడ హోటల్ కి సంబంధించిన ఫుడ్ కు సంబంధించిన డబ్బులను కూడా అదనంగా ఇస్తున్నారు. దాంతో ఆమె షూటింగ్ కి వచ్చారు సినిమా మొత్తంలో ఆమె షూటింగ్ 10 నుంచి 12 రోజులు ఉండడంతో ఆమెకి 5 నుంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేశారు రాజమౌళి స్ట్రాటజీ ప్రకారం ఆమెకి ఐదారు కోట్ల వరకు చెల్లించినప్పటికీ ఆ సినిమాలో ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండడంతో ఆవిడ మీద పెట్టిన డబ్బులు మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తుంది అనే ధీమాతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేయబోయే సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం దీపిక పదుకొనే దాదాపు ఎనిమిది కోట్ల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో విపరీతంగా పాపులర్ అయిన ఈ హీరోయిన్లు మాత్రం సౌత్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. స్టార్ దర్శకుడిగా పేరు పొందిన దర్శకుల సినిమాల్లో మాత్రమే నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇంతకు ముందు దీపికా పదుకొనే జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన లవ్ 4 ఎవరులో ఒక స్పెషల్ సాంగ్ లో చేసినప్పటికీ ఆ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు… ప్రస్తుతం ఆమె ప్రభాస్ పక్కన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దీపికా పదుకొనే అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here