నాకు అవకాశాలు తగ్గలేదు.. నేనే అవకాశాలను తగ్గించుకున్నా: బ్రహ్మానందం

0
125

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలలో కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే రాను రాను బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు. అయితే ఆయన ఎందుకు సినిమాలు తగ్గించారు? ఆయనే సినిమాలు తగ్గించారా? లేక ఆయనకు అవకాశాలు రాక ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారా?అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై స్పందించారు బ్రహ్మానందం. తాను యాక్టింగ్ కి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.

దాదాపుగా నేను గత 35 ఏళ్ల నుంచి 3,4 షిఫ్ట్ లు పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలోనే సరైన తిండి తినక, నిద్ర లేక, తిన్నది అరగక వాంతులు చేసుకుంటూ ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే ప్రస్తుతం నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవడానికి కొంత డబ్బును పోగొట్టుకున్న నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేసాడు బ్రహ్మానందం.

అదేవిధంగా తనపై వస్తున్న మీన్స్ పై స్పందిస్తూ.. నాపై మీన్స్ చేసే వాళ్లకు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే నేను సినిమాల్లో నటించకపోయినా ఇప్పటికీ నన్ను జనాలు మర్చిపోకుండా గుర్తు చేసేలా చేస్తున్నా మీన్స్ క్రియేటర్స్ ని, వాళ్ళ ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా తన కోసం తానే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.