ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు మూత పడటంతో విద్యార్థులకు తరగతుల విషయంలో ఆటంకం కలగకుండా ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించాలని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తరగతులను వింటున్నారు. ఈ క్రమంలోనే తరగతులను వినడానికి పెద్ద స్క్రీన్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్, ట్యాబ్ లకి బాగా డిమాండ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఆన్లైన్ తరగతులను వినడానికి విద్యార్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించకుండా తక్కువ ధరలకే ఆన్లైన్ తరగతులకు సరిపోయే ల్యాప్టాప్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కేవలం 30 వేల రూపాయలలోపు ఎన్నో ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. మరి 30 వేల లోపు బెస్ట్ ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
*యాపిల్ ఐప్యాడ్ వైఫై మోడల్ ధర కేవలం రూ.29,900 మాత్రమే.
*సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 8.0 ధర కేవలం 12,350 మాత్రమే. ఈ ట్యాబ్ లో మనకు వైఫై 4జీ కనెక్టివిటీ సదుపాయం ఉంటుంది.
*ఇక లెనోవో యోగా అ ట్యాబ్ కేవలం 20, 999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 64 జీబీతో పాటు ఇంటర్నల్ స్టోరేజీ, వైఫై, 4జీ కనెక్టివిటీ ఉంటుంది.
- ఏసెర్ వన్ 14 విండోస్ ల్యాప్టాప్ ధర కేవలం 22,997 రూపాయలు.4జీబీ ర్యామ్, 1టీబీ హెచ్డీడీ స్టోరేజీ, ఏఎండీ రడేయాన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ దీంట్లో ఉన్నాయి.
ఇవే కాకుండా మరికొన్ని రకాల కంపెనీలకు చెందిన లాప్ టాప్ లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా 30 వేలలోపు ల్యాప్టాప్లు మనకు ఆన్లైన్ తరగతులు వినడానికి, ఎం ఎస్ ఆఫీస్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లు సాధారణ సాఫ్ట్ వేర్లు వాడటానికి ఈ లాప్టాప్లు సరిపోతాయి.


































