రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి ఆరోపణలను కేంద్రం ఖండించింది. విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. దాడి ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ ను కేంద్రం విడుదల చేసింది.

కాగా సభాపతి స్థానం వద్దకు విపక్ష ఎంపీలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడం సీసీ వీడియో లో కనిపిస్తోంది. ఎంపీలను మార్షల్స్ చుట్టుముట్టినట్లు, ఇద్దరు మహిళా ఎంపీలు ఓ మహిళా మార్షల్‌ను తోసేసినట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

































