Chalaki Chanti: చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు.చలాకి చంటి ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో మంచి గుర్తింపు పొందిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చలాకి చంటి జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ నాకు జబర్దస్త్ కార్యక్రమం వల్ల పేరు ప్రఖ్యాతలు రాలేదు. నేను ఎన్నో సినిమాలలో నటించడం వల్లే తనకు జబర్దస్త్ అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. చాలామందికి జబర్దస్త్ వల్ల మంచి పేరు వచ్చి ఉండవచ్చు నా విషయంలో అయితే అలా జరగలేదని ఈయన తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమం గురించి ఈయన మాట్లాడుతూ సాధారణంగా జబర్దస్త్ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే తిరిగి ఆ కార్యక్రమంలోకి వారిని తీసుకోరు ఇది వాళ్ళ రూల్. అయితే తాను ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమంలో మూడుసార్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చానని ఈ సందర్భంగా చలాకి చంటి వెల్లడించారు. ఇది వాళ్లు నాకు ఇచ్చే గౌరవం అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

Chalaki Chanti:
ఇకపోతే తాను వరుసగా జబర్దస్త్ లో చేయటం వల్ల ఎక్కువ తలనొప్పి రావడంతో శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చెప్పి మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుని తిరిగి ఈ కార్యక్రమంలోకి వెళ్లాను. మరోసారి పర్సనల్ ప్రాబ్లం వల్ల బయటకు వచ్చాను ఇంకోసారి 29 రోజులపాటు యుఎస్ లో సినిమా షూటింగ్ ఉండటం వల్ల అప్పుడు కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని తిరిగి ఈ కార్యక్రమానికి వచ్చానని అయితే నేను ఎప్పుడు బయటకు వెళ్లిన శ్యాంప్రసాద్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఆయనకు చెప్పి వెళ్తానని తెలిపారు.ఇలా ఈ సందర్భంగా ఈయన జబర్దస్త్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే బిగ్ బాస్ 6 కార్యక్రమంలోకి కూడా ఈయన వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పరోక్షంగా చంటి కూడా తెలియజేశారు


























