మనలో చాలామంది పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడంతో పాటు పిల్లలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోకుండా సంతోషంగా జీవించాలని భావిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లల చిన్నప్పటి నుంచే సరైన రీతిలో పొదుపు చేయడం ద్వారా పిల్లలను సులువుగా కోటీశ్వరులను చేయడం సాధ్యమవుతుంది. కొన్ని స్కీమ్ ల ద్వారా పిల్లలు కెరీర్ లో సెటిల్ కాకముందే వాళ్లను కోటీశ్వరులను చేయడం సాధ్యమవుతుంది.

అయితే అలా కోటీశ్వరులను చేయాలని అనుకుంటే ఆర్థిక క్రమశిక్షణ ఉంటే మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవడం సాధ్యమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పిల్లల పేర్లపై ఇన్వెస్ట్ చేస్తే వాళ్లు పెద్దయ్యే సరికి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలుగుతారు. తల్లి తండ్రి డాక్యుమెంట్లతో పాటు పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ ఉంటే సులభంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం సాధ్యమవుతుంది.

సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల స్వల్ప కాలంలో పెద్దగా ప్రయోజనం చేకూరకపోయినా దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడిని పొందవచ్చు. నెలకు కనీసం 4000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ సంవత్సరం సంవత్సరానికి ఇన్వెస్ట్ మెంట్ ను 20 శాతం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం ద్వారా 20 సంవత్సరాల తరువాత కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందవచ్చు.

సరైన విధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లలకు ఉత్తమ భవిష్యత్తును ఇవ్వవచ్చు. 20 సంవత్సరాల తరువాత ఎదిగిన పిల్లలు ఆ డబ్బును తమ భవిష్యత్ కోసం వ్యాపార రంగంలో రాణించడం కోసం ఖర్చు చేసినా వారు కెరీర్ విషయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సులువుగా ఎదిగే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here