ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అయితే ఈ పరిణామం ఎలా జరిగింది, అసలు అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ సాగుతుంది.

ఈ నేపధ్యంలో తెలంగాణ నిఘా విభాగం ఈ ఘటనపై కీలక సమాచారం సేకరించింది. ఒకే ప్రాంతంలో సుమారు 6 గంటల పాటు జవాన్లు వేచిచూడటంతోనే ఈ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని స్థానిక పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మృతదేహాలను హెలికాప్టర్ లో తరలించాలనే ఉద్దేశ్యంతో అక్కడే ఉండిపోవడం జవాన్ల మృతికి కారణమంటూ తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here