Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత దూకుడు కనబడుస్తున్నారు. ఈయన వరుస సినిమా షూటింగులలో పాల్గొంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరు తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు.
ఇలా ఈ సినిమాకు సంబంధించి తన పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి కొద్ది రోజులపాటు వెకేషన్ లో సరదాగా గడపడం కోసం ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్లో అమెరికా వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Chiranjeevi: సుస్మిత నిర్మాణంలో చిరు..
ఇక ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియా చేరుకున్న అనంతరం చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు తన కొత్త సినిమాని కూడా ప్రారంభించబోతున్నారు ఇక తన తదుపరి సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణంలో నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియజేయనున్నారు.































