దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రభావం సినిమా రంగంపై ఎక్కువగా పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కరోనా మహమ్మారి వల్ల వందల కోట్ల రూపాయలు నష్టపోయింది. షూటింగ్ లు ప్రారంభమైనా ఎన్నో జాగ్రత్తల మధ్య సినిమాలను, సీరియళ్లను షూట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే సినిమా షూటింగ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరికొన్ని రోజుల్లో థియేటర్లు ఓపెన్ కానున్న నేపథ్యంలో ప్రజల్లో టికెట్ ధరల గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రం థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలను ప్రదర్శించేలా అనుమతి ఇస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ అంత తేలిక కాదు. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.

చిన్న సినిమాల విషయంలో 50 శాతం ఆక్యుపెన్సీ వల్ల ఎటువంటి సమస్య ఉండదు కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు మాత్రం నష్టాలు తప్పవు. మరోవైపు ప్రేక్షకులు కూడా కరోనా భయం వల్ల సినిమా థియేటర్ల వైపు అడుగులు వేసే పరిస్థితులు లేవు. సినిమా చూస్తున్నంత సమయం మాస్క్ ధరించడం అంత తేలిక కాదు. దీంతో తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఐతే టికెట్ రేట్లను పెంచకూడదని ఓనర్స్ అసోసియేషన్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం టికెట్ రేట్లు పెరగకపోయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడటం గ్యారంటీ అని థియేటర్ లో సినిమా చూడాలంటే మరింత ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here