కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలల నుంచి అన్ని ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో స్కూలు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ క్రమంగా తెరుచుకున్నాయి.పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు సైతం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్ కి వెళ్లాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే నవంబర్ 2 నుంచి పలు రాష్ట్రాలలో స్కూల్ నిర్వహించేందుకు కొన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఈ తరుణంలోనే మొదటి రోజే ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, కాస్త ఆందోళనకు గురైన సంఘటన డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది.

సుమారు ఏడు నెలల క్రితం నుంచి మూతబడ్డ పాఠశాలలో నవంబర్ 2న తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డెహ్రడూన్ ప్రభుత్వం కూడా పాఠశాలలు నిర్వహించేందుకు అనుమతి తెలుపడంతో అన్ని పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇలాంటి తరుణంలో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది సేపటికే పాఠశాల యాజమాన్యం చేదు వార్తను వినాల్సి వచ్చింది. రాణికేత్ కు చెందిన ఓ విద్యార్థి తన తండ్రి దగ్గర నుంచి పాఠశాల యాజమాన్యానికి ఫోన్ కాల్ వచ్చింది. తమ కుటుంబ సభ్యులలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది.
పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాజిటివ్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అవడం వల్లే కుటుంబ సభ్యులకు కరోనా సోకిందనీ ఆ విద్యార్థి తండ్రి తెలియజేశాడు. ఆ విద్యార్థి తో కాంటాక్ట్ అయిన మరో 15 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి,వారిని ఐసోలేషన్ కు తరలించారు.
పాఠశాల తెరిచిన మొదటి రోజు ఇలా కావడంతో కొంత ఆందోళన చెందారని పాఠశాల యాజమాన్యం తెలిపారు. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలా జరగడం ఎంతో నిరుత్సాహపరిచిందని తెలియజేశారు. ఐసోలేషన్ కు పంపిన 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేసి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పాఠశాల యాజమాన్యం సూచించింది.































