తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై సంజయ్ ఫైర్..

0
246

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని వివరించారు. బోర్డుల సమావేశానికి కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు హాజరయ్యారని.. కానీ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారని విమర్శించారు.

కాగా హైదరాబాదు జలసౌధాలో ఈఎన్సీ సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు కొట్టారు చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు సమావేశానికి కేసీఆర్ హాజరైతే ఏపీ ప్రాజెక్టుల పై నిలదీసే అవకాశం ఉండేదని.. ప్రాజెక్టుల ప్రయోజనాన్ని కాపాడుకుని వీలుండదని సంజయ్ స్పష్టం చేశారు.