Jr NTR -Kalyan Ram: టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా కొనసాగుతున్నటువంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకరని చెప్పాలి. వీరిద్దరూ రామలక్ష్మణుల మాదిరిగానే ఉంటారు ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటారు. సినిమాలకు తమ్ముడు చేదోడు వాదోడుగా నిలబడితే తమ్ముడు సినిమాలను అన్న నిర్మిస్తూ ఉంటారు.

ఇక హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మధ్య బాండింగ్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. తమ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగిన లేదా సినిమా ఈవెంట్లకు వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇలా ఎంతో క్లోజ్ గా ఉండే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య ఒక హీరోయిన్ కారణంగా పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుందని తెలుస్తుంది.
ఎన్టీఆర్ పెళ్లి కాకముందే ఒక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారని ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు నిజమేనని భావించినటువంటి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి నువ్వు ఇలా హీరోయిన్ తో తిరగడం ఏమాత్రం బాగలేదు మన కుటుంబం ఎంతో పద్ధతి గల కుటుంబం. ఇలాంటివన్నీ మన కుటుంబంలో నచ్చదు అందుకే ఆ హీరోయిన్ తో తిరగడం మానేసి పద్ధతిగా ఇంట్లో పెద్దవాళ్లు చూసిన సంబంధం చేసుకో అంటూ ఈయనకి వార్నింగ్ ఇచ్చారట.
క్షమాపణలు చెప్పిన కళ్యాణ్ రామ్..
ఇలా ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ వార్నింగ్ ఇవ్వడంతో కళ్యాణ్ రామ్ పట్ల ఎన్టీఆర్ కూడా సీరియస్ అయ్యారట నేను ఆ హీరోయిన్ తో తిరుగుతున్నానని వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా ఆ వాస్తవమని నాకు తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పారట అయితే ఇది తర్వాత ఫేక్ అని తెలియగానే కళ్యాణ్ రామ్ చాలా బాధపడ్డారని తెలుస్తోంది అందుకే తన తమ్ముడి వద్దకు వెళ్లి పొరపాటున తాను అన్న మాటలను మనసులో పెట్టుకోవద్దు అంటూ తనని క్షమించమని కోరుకున్నారట ఇలా ఒక హీరోయిన్ కారణంగా ఈ అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చాయి అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.































