నేల్లురూ, కృష్ణపట్నం లోని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. భోగిని ఆనందయ్య పంపిణీ చేస్తున్న పసర మందు కొందరిపై పని చేయడం లేదని వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

తాజగా రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి క్షీణించింది. అయన ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీనితో ఆనందయ్య ఇస్తున్న పసర మందు కొంతమందిపై పనిచేయడం లేదని వైద్యులు భావిస్తున్నారు.



























