Covid 19: ప్రపంచంలో మరోసారి కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రతరం అవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ దేశాల్లో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో కూడా కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మళ్లీ ఫిలిం ఇండస్ట్రీని వణికిస్తోంది. కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ… థియేటర్లలో సినిమాలు విడుదల అవుతున్న క్రమంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అవుతున్నాయి. దీంతో పాటు పలు రాష్ట్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపాలని ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజాగా పలువరు సినిమా స్టార్లు కరోనా బారినపడుతుండటం అభిమానులతో పాటు ఇండస్ట్రీని కలవరపరుస్తోంది. తాజాగా బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో జాన్ అబ్రహం కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన
భార్య ప్రియారుంచల్ కు కూడా కరోనా సోకింది. ఇప్పటికి రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా సోకినట్లు జాన్ అబ్రహం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆందోళనలో అభిమానులు..
బాలీవుడ్ లో ఇప్పటి వరకు అర్జున్ కపూర్ అండ్ ఫ్యామిలీ, కరీనా కపూర్, నోరా ఫతేహి వంటి వారు కరోనా బారిన పడ్డారు. కోలీవుడ్ లో కమల్ హాసన్, విక్రమ్, వడివేలు కరోనాతో కోలుకున్నారు. టాలీవుడ్ లో మంచు మనోజ్ కు కూడా కరోనా సోకింది. ఇలా తమ అభిమాన స్టార్లకు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
































